నార్త్ కొరియాలో ఆ త‌ప్పు చేస్తే 15 ఏళ్ల జైలు శిక్ష లేదా – మ‌ర‌ణ‌శిక్ష

Making that mistake in North Korea carries a 15-year prison sentence or the death penalty

0
114

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీసుకువ‌చ్చే చ‌ట్టాలు ఎలా ఉంటాయో తెలిసిందే. సొంత బంధువులు త‌ప్పుచేసినా వారిని క‌ఠినంగా శిక్షిస్తారు. ఇలాంటి అనేక చ‌ట్టాలు ఆ దేశంలో ఆయ‌న పాల‌న‌లో ఉన్నాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం మ‌రికొన్ని చ‌ట్టాలు అమ‌లులోకి తీసుకువ‌చ్చార‌ట‌.
మరి ఆ కొత్త చ‌ట్టాలు ఏమి తీసుకువ‌చ్చారో చూద్దాం.

దేశంలో ప్రజలెవ్వరూ కూడా జుట్టుకు రంగు వేయకూడదు.
తాను సూచించిన 215 ర‌కాల హెయిర్ కట్స్‌ మాత్రమే ఫాలో కావాలి.
ఇత‌ర దేశాల స్టైల్స్‌, వస్త్రాధారణను ఫాలో అవ్వ‌కూడ‌దు
చిరిగిపోయిన జీన్స్, టీ షర్ట్స్‌లను యువ‌త కాని పెద్ద‌లు కాని వేసుకోకూడ‌ద‌దు
ముక్కు, పెదాలపై రింగులు పెట్టుకోకూడ‌దు
సినిమాలు, సంగీతం, వీడియోలను బ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శ‌న చేస్తే జైలు శిక్ష విధిస్తారు
దక్షిణ కొరియా పాటలు విన్నా, సినిమాలు, వీడియోలు చూసినా 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.
ఎవ‌రైనా పిల్లలు ఈ తప్పు చేస్తే. వారి తల్లిదండ్రులకు శిక్ష వేస్తున్నారు. ఇక మ‌రింత క‌ఠినంగా ఉంటే వారికి మ‌ర‌ణ‌శిక్ష కూడా విధిస్తున్నారు.