మలయాళ నటి శరణ్య శశి క‌న్నుమూత‌

Malayalam actress Saranya Shashi No More

0
89

ఈ క‌రోనా చాలా మందిని మ‌న నుంచి దూరం చేసింది. ఎంద‌రో సినిమా న‌టులు టెక్నిషియ‌న్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మ‌రో సినీ న‌టి క‌రోనా కాటుకి బ‌లైపోయింది. ఒక్క సారిగా ఈ వార్త చిత్ర సీమ‌ని విషాదంలో ముంచెత్తింది. ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించే ఆమె ఇక లేరు అనే మాట ఆ సినిమా ప్ర‌పంచం జీర్ణించుకోలేక‌పోతోంది.

మలయాళ నటి శరణ్య శశి ఆమె వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు కరోనాతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు శరణ్య. ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న స‌మ‌యంలో ఆమెకి క‌రోనా సోకింది. దీంతో ఆరోగ్యం మ‌రింత విష‌మించింది. ఆగస్ట్ 9న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

ఒక్క‌సారిగా ఈ వార్త మ‌ల‌యాళ చిత్ర సీమ‌లో విషాదం నింపింది. ఆమె ప‌దేళ్లుగా క్యాన్స‌ర్ తో పోరాటం చేస్తున్నారు.
చివ‌ర‌కు ఆమెను కరోనా సైతం వదల్లేదు. కరోనా నుండి కోలుకుంటుంది అనుకునే లోపు ఆమెను ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడాయి. న్యుమోనియాతో కూడా బాధ‌ప‌డ్డారు ఇలా అనేక స‌మ‌స్య‌లు రావ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.