మెట్రోస్టేషన్‌ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..ఆలస్యంగా వెలుగులోకి..

Man commits suicide by jumping off metrostation

0
85

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పై నుండి దూకి రాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి సమయంలో మెట్రో స్టేషన్ పై నుండి దూకడంతో రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున రాజు మృతి చెందాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.