Man cuts woman’s throat in kazipet Hanamkonda: ప్రేమించడం లేదని యువతి గొంతు కోసేసాడు ఓ యువకుడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలో కడిపికొండలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు గత కొంతకాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెకి ఇష్టం లేదని తెలిపిన వెంటపడుతున్నాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు శ్రీనివాస్ ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ శ్రీనివాస్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఆమెని పెళ్లి చేసుకోమని తరచూ వేధిస్తున్నాడు. కుదరదని యువతి తేల్చి చెప్పడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న శ్రీనివాస్… యువతి గొంతు కోసేసాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయాల పాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా స్థానికులు శ్రీనివాస్ కి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.