ప్రేమవ్యవరంలో ఓడిపోయి వ్యక్తి ఆత్మహత్య..

0
72

ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న బాధలను తట్టుకోలేక మనస్తాపానికి గురయ్యి చనిపోతున్నారు. క్షణకాలంలోనే తమ ప్రాణాలను తామే బలితీసుకుంటున్నారు. .తాజాగా ప్రేమవ్యవరంలో ఓ వ్యక్తి  ఓడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన తేది 4/4/2022న 10 గంటల ముందర సమయమున గుల్లిపాడు రైల్వే స్టేషన్  పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన గుల్లిపాడు రైల్వే స్టేషన్ల మధ్య ఎవరో గుర్తు తెలియని రైలు బండి క్రింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకుని  మరణించాడు.

ఇతని పేరు ఊరు తెలియలేదు ఇతను నలుపు రంగు మీద పసుపు రంగు అడ్డ చారలు కలిగిన ఫుల్ చేతుల టిషర్టు వేసుకున్నాడు. మిలటరీ గ్రీన్  నిక్ కంపెనీ రన్నింగ్ ప్యాంట్ దుస్తులు ధరించి వున్నాడు. ఇది తప్ప ఇతని వద్ద ఏటువంటి ఆధారాలు లేవు. ఈ కేసు తుని గవ్నమెంట్ రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ మారూఫ్ గారు దర్యాప్తు చేసారు.

ఆత్మహత్య చేసుకున్నయువకుని వయస్సు 19 సంవత్సారాలు. ఈ యువకుడు మాదిగ కులానికి చెందినవాడు. విశాఖ జిల్లా పరవాడ  మండలం చీపురుపల్లి గ్రామం వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు పేరు ఆరుగుల చందు తండ్రి పేరు లేటు ఏసు రాజు. యువకుడి నాయనమ్మ ఊరు అయిన న్యాయం పూడి గ్రామనికి 2 రోజుల క్రితం వచ్చివున్నాడు. ఇతను ఒక అమ్మాయికి ప్రేమించాడు.

ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళికి నిశ్చతార్థం అయిందని తెలియడంతో..మనస్తాపానికి గురయ్యి  ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. రైల్వే గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి. తుని గవ్నమెంట్ ఏరియా హాస్పటల్ నందు శవపరీక్ష జరిపించిన అనంతరం శవంను వారి రక్త బంధువులకు అప్పగించడమైనది.