Murder: భార్యా భర్త చికెన్‌.. మధ్యలో పక్కింటాయన.. వెరసి హత్య

-

Murder:భార్యభర్త చికెన్‌ కూర గురించి గొడవపడుతున్నారు.. వారిద్దర్నీ విడిపించేందుకు పక్కింటాయన పెద్దరికం తీసుకున్నాడు. ఇది నచ్చిన ఆ భర్త.. సదరు వ్యక్తిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి, దారుణంగా హత్య (Murder) చేశాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని బిఖిరియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఛవాని పత్తర్‌ గ్రామంలో పప్పు అహిర్వార్‌ భార్యతో కలిసి నివాసముండేవారు. పప్పు అహిర్వార్‌ మద్యానికి బానిసై.. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడే వాడు. ఇదే క్రమంలో చికెన్‌ తీసుకొచ్చి, కూర వండమని అహిర్వార్‌ భార్యకు సూచించగా.. భార్య చికెన్‌ వండేందుకు నిరాకరించింది. దీంతో కోపంతో ఆమెపై దాడికి దిగాడు.

- Advertisement -

గొడవ పెరిగి మరింత పెద్దది కావటంతో ఇరుగుపొరుగు వాళ్లు గూమికూడారు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే బబ్లూ.. గొడవ పడకూడదంటూ వారించే ప్రయత్నం చేశాడు. బబ్లూ తమ గొడవలో కలగజేసుకోవటంపై.. పప్పు అహిర్వార్‌ కోపంతో రగిలిపోయాడు. దీంతో పక్కనే ఉన్న కర్ర తీసుకొని బబ్లూపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బబ్లూను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పప్పు అహిర్వార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కిరణ లతా కర్కేట వెల్లడించారు.

Read also: పలాసలో సైకో‌ హల్‌చల్‌.. 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...