తెలంగాణలో సంచలనం రేపిన మంచిర్యాల(Mancherial) జిల్లా మహేష్ దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. తన భర్త నుంచి తనను విడిపించాలని మహేష్‌ను వేడుకుంటున్న వివాహిత వీడియో కలకలం రేపుతోంది. భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తన నుంచి కాపాడాలని కోరింది. ఈ వీడియోలను పరిశీలించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వివాహితను వేధిస్తున్నాడంటూ మహేష్ అనే యువకుడిని ఆమె కుటుంబసభ్యులు దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారు. జైపూర్ మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తాజాగా విడుదలైన యువతి వీడియో చూస్తుంటే మాత్రం ఆమెను మహేష్ వేధించలేదని అర్థమవుతోంది. ఆ వివాహిత కుటుంబసభ్యులు తమ కుమారుడిని ఎందుకు హత్య చేశారో కారణాలు కనుక్కొని వారిని కఠినంగా శిక్షించాలని మహేష్ ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది.
Read Also: ఎంపీకి దోమలు కుట్టాయి.. ఇంకేముంది రైలును ఆపేసిన సిబ్బంది
Follow us on: Google News, Koo, Twitter