Flash: తిరుపతిలో మందుబాబులు హల్ చల్..భర్త ముందే మహిళపై

0
79

తిరుపతిలో మందుబాబులు హల్ చల్ చేశారు. కొర్లగుంట సమీపంలోని ఓ మెడికల్ షాప్ వద్ద భర్త ముందే ఓ మహిళపై ముగ్గురు మందుబాబులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఆమె భర్త వారిని అడ్డుకోవడంతో అతడి పై మందుబాబులు దాడి చేశారు. తన భర్తను కొట్టద్దని మహిళ ప్రాధేయపడినా వారు వదిలిపెట్టలేదు. మమ్మల్ని ప్రశ్నిస్తావా నేను పోలీస్ అని విచక్షణా రహితంగా దాడి చేశారు. దీనిని గమనించిన స్థానికులు ఆ ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోపే ముగ్గురు వ్యక్తులు పరార్ అయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.