మావోయిస్టుల ఘాతుకం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని..

0
76

మధ్యప్రదేశ్ లో పోలీసు ఇన్ ఫార్మర్లనే నెపంతో ఇద్దరు వ్యక్తులను హతమార్చిన మావోయిస్టులు 24 గంటల వ్యవధిలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బిహార్ గయాలోని మౌన్ బార్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీశారు.

అనంతరం వారి ఇంటిని బాంబుతో పేల్చి వేశారు. ఈ కుటుంబం ఇన్ ఫార్మర్లగా వ్యవహరించటం వల్ల గతంలో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో చాలా మంది మావోయిస్టులు చనిపోయినట్లు..నక్సలైట్లు ఆరోపించారు. అందుకు ప్రతికారంగానే వారిని హత మార్చినట్లు పోస్టర్ అంటించారు. దాదాపు 25 మంది నక్సలైట్లు సమూహంగా వచ్చి నలుగురిని ఉరి తీసినట్లు గ్రామంలోని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. గతంలోనూ గుంపుగా వచ్చి వారిని బెదిరించినట్లు వెల్లడించారు.