Flash- మావోయిస్టు అగ్రనేత కన్నుమూత

Maoist top eyelid

0
70

మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కె బస్తర్ జిల్లా బీజాపూర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు చత్తీస్ ఘడ్ డిజిపి అధికారికంగా ప్రకటించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో జరిగిన చర్చల్లో ఆర్కే పాల్గొన్నారు. 4 సంవత్సరాల క్రితం బలిమెల జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్కేకు  గాయాలు కాగా అతని కుమారుడుతో పాటు అనేక మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే ఆ ఘటనలో తప్పించుకున్న ఆర్కే అప్పటినుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్కే పై 20 లక్షల రివార్డు ఉంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆర్కేది సొంత స్థలం గుం టూరు జిల్లా తుమ్మూరు కోట, మార్కెట్ భార్య పద్మ మావోయిస్టు ఉద్యమం నుంచి నుంచి లొంగిపోయి ప్రకాశం జిల్లాలో తన ఇంటి వద్ద ఉంటున్నారు. కాగా ఆర్కే మృతిపై మావో యిస్టుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారు చేసిన ప్రకటనపై స్పష్టత రానుంది.