ఫోటోలో ఓ వ్యక్తిని చూపించారు – తాళి మరొకరు కట్టారు – అమ్మాయి కాపురం వేరే వ్యక్తితో

ఫస్ట్ నైట్ రోజున అమ్మాయి వరుడిని చూసింది ఒక్కసారిగా షాక్

0
144

ఉత్తరాఖండ్ లోని సితార్గంజ్ లో ఈ విచిత్ర కేసు నమోదు అయింది. ఇదేమిటి ఇంత విచిత్రంగా ఉంది ఈ కేసు అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఒక యువకుడి ఫొటో చూపించారు పెద్దలు. అతను బాగున్నాడని ఆమె పెళ్లికి ఒకే చెప్పింది. కానీ పెళ్లి సమయంలో ఆచారం ప్రకారం వరుడికి ముసుగు వేసి తాళి కట్టించారు. ఇక ఫస్ట్ నైట్ రోజున అమ్మాయి వరుడిని చూసింది ఒక్కసారిగా షాక్ అయింది.

ఎందుకంటే ఆ అమ్మాయి ఫోటోలో చూసిన వ్యక్తి వేరు తాళికట్టిన వ్యక్తి వేరు. వేరొకరితో ఆమెకి వివాహం జరిపించారు అత్తింటివారు. దీంతో అతని గురించి తెలుసుకుంటే అతనికి అప్పటికే వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు అని తెలిసింది. దీంతో ఆమె అత్తారింటి నుంచి పారిపోయింది.

చివరకు ఆమె తన ప్రియుడి దగ్గరకు వెళ్లి తనని మోసం చేశారు అని తనని వివాహం చేసుకోమని కోరింది. అతను ఆమెని అర్దం చేసుకుని ఒకే అన్నాడు. చివరకు అతనితో ఆమె కలిసి ఉంటోంది తనని మోసం చేసి వివాహం చేశారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వరుడిపై కేసు నమోదు చేశారు. ప్రియుడితో పెళ్లికి పేరెంట్స్ ని ఒప్పించే పనిలో ఉంది ఈ కొత్త జంట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కచ్చితంగా పెళ్లిచేసుకోవాలని ఆ జంట నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రేమించిన వ్యక్తితోనే కాపురం చేస్తాను అని తెలిపింది ఈ అమ్మాయి.