లక్షలు ఖర్చుతో పెళ్లికి ఏర్పాట్లు – 10 రూపాయల గుట్కా ప్యాకెట్ తో పెళ్లికి బ్రేక్

Marriage Cancelled due to gutka packet

0
77

 

ఈ రోజుల్లో పెళ్లి అంటే కచ్చితంగా వరుడు తాళికట్టి ఏడు అడుగులు వేసేవరకూ భయంతోనే ఉంటున్నాడు. ఎక్కడ అమ్మాయి నాకు ఈ పెళ్లి వద్దు అంటుందో అని. మొత్తానికి ఇటీవల ఇలాంటి వివాహ సంఘటనలు మనం చూస్తునే ఉన్నాం. నిన్న ఓ యువతి పెళ్లి పీటలపై మద్యం తాగి కూర్చున్నాడని యూపీలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇక తాజాగా మరో యువతి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న మద్యం అయితే, ఇప్పుడు గుట్కా ప్యాకెట్ వల్ల ఈ పెళ్లి ఆగింది.

లక్షలు ఖర్చు చేసి పెళ్లికి ఏర్పాట్లు చేస్తే, 10 రూపాయల గుట్కా పాకెట్ ఈ పెళ్లి ఆపేసింది..ముహుర్తం సమయంలో వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని వధువు గ్రహించింది. ఇక నాకు ఈ పెళ్లికొడుకు వద్దు అని చెప్పింది. అంతేకాదు అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి వరకూ మనోడు ఇక పెళ్లి అయిపోతుంది అని సంతోషంగా ఉన్నాడు. కాని తనకు ఉన్న ఈ గుట్కా అలవాటు వల్ల ఆమె అతన్ని వద్దని నిరాకరించింది.

ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో మిశ్రౌలి గ్రామంలో జరిగింది ఈ ఘటన. అబ్బాయి ఈ అలవాటు మానేస్తాడని ఇరు కుటుంబాల పెద్దలు వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. దీంతో చేసేదిలేక కట్న కానుకలు అన్నీ వెనక్కి ఇచ్చేశారు.