మ‌రో గంట‌లో పెళ్లి – పోలీసులు ఎంట్రీ చివ‌ర‌కు వ‌ధువు ఫుల్ హ్యాపీ

Marriage in one hour -The bride is full happy to the end of the police entry

0
101

మ‌రో గంట‌లో ఆమెకి పెళ్లి ఇక మూడు ముళ్లు ప‌డ‌తాయి అని అనుకుంటున్న స‌మ‌యంలో అక్క‌డ‌కు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇక పెళ్లి క్యాన్సిల్ అయింది వ‌ధువు మాత్రం ఫుల్ హ్యాపీ ఇంత‌కీ ఎందుకు ఆమెకి అంత సంతోషం. అస‌లు సంగ‌తి ఏమిటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.

త‌మిళనాడులోని చెన్నై పుజల్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల జనతుల్లా ఫిర్డోస్ అనే యువతికి.. ఆమె కుటుంబసభ్యులు ఇష్టం లేని పెళ్లిని నిశ్చయించారు. ఆమె మేన‌మామ‌కు ఇచ్చి పెళ్లి చేయ‌డానికి ఏర్పాట్లు చేశారు. వధువుకు ఏం చేయాలో తెలియలేదు. పెళ్లిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంది.
చివ‌ర‌కు ఓ వీడియో తీసి జ‌రిగిన విష‌యం వీడియోలో పంపింది స్నేహితుల‌కి.

చివ‌ర‌కు ఈ వీడియో స్నేహితుల నుంచి పోలీసుల‌కు చేరింది. పోలీసులు మండ‌పానికి చేరుకుని వెంట‌నే పెళ్లిని ఆపేశారు. వధువు తల్లిదండ్రులు, వరుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు.