ఒకరు కాదు ఇద్దరు కాదు 8 మందిని పెళ్లి చేసుకుంది- ఆమెకి ఎయిడ్స్ – చివరన మరో ట్విస్ట్

Married 8 people- she has AIDS

0
83

పెళ్లి చేసుకోవాలి అని చూస్తున్న యువకులు ఆమె టార్గెట్ . ఏదో విధంగా వారిని తన వలలో వేసుకుంటుంది. పెద్దలకి స్నేహితులకి చెప్పద్దు అని గుడిలో పెళ్లి చేసుకుంటుంది. కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత కావాలనే గొడవలు పెట్టుకుంటుంది. భయపెట్టి సెటిల్మెంట్కు రప్పిస్తుంది. అందినంత దోచుకుని అక్కడి నుంచి పరారవుతుంది. ఈ కిలాడి చేతిలో ఇప్పటి వరకూ ఇలా 8 మంది మోసపోయారు.

హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు 2010లో పాటియాలాలో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయింది.ఇక నాలుగు సంవత్సరాలు తర్వాత భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఇక కుటుంబ సభ్యుల దగ్గరే ఉంటూ మోసాలు స్టార్ట్ చేసింది. పంజాబ్, హర్యానాలలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న లేదా భార్య చనిపోయిన భర్తలను ట్రాప్ చేయడం మొదలుపెట్టింది.

వారిని ట్రాప్ లో దించి పెళ్లి చేసుకునేది. గొడవ పెట్టుకుని భర్తలని సెటిల్మెంట్ కి పిలుస్తుంది. లక్షల్లో భరణం కింద తీసుకుంటుంది. తర్వాత అక్కణ్నుంచి పరారవుతుంది. ఇలా మోసపోయిన వారు ముగ్గురు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆమె ఎక్కడ ఉందా అని వెతికారు పోలీసులు. చివరకు హర్యానాలో 9వ పెళ్లికి సిద్దం అయింది. అక్కడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. ఇక ఆమెని పెళ్లి చేసుకున్న వారు అందరూ కూడా ఇప్పుడు టెస్టులు చేయించుకుంటున్నారు