ఐదు రోజుల్లో పెళ్లి..అంతలోనే అనంతలోకాలకు యువకుడు

0
82

జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ యువకుడు. మరో ఐదు రోజుల్లో పెళ్లి. అంతలోనే అనుకోని ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఏపీలోని కర్నూలు జిల్లా అల్లూరులో ఈ సంఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే?

సోమశేఖర్‌కు ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. అవసరం నిమిత్తం పని మీద బైక్ పై వెళ్లి వస్తుండగా అల్లూరు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సోమశేఖర్, నాగరాజు అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి పీటలెక్కాల్సిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.