ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి – చివరకు ఎంత దారుణం చేశాడంటే

Married to another for the young woman he loved

0
105

ఈ మధ్య కొందరు అబ్బాయిలు ప్రేమ అనే పేరుతో అమ్మాయిలని వేధిస్తున్నారు. ఆ అమ్మాయి ఇష్టం లేదు అని చెప్పినా వారి వెంట పడుతున్నారు. తమ ప్రేమని రిజక్ట్ చేస్తే వారిపై దాడి చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు పోలీసులు. తాజాగా యూపీలోని ఘజియాబాద్లో దారుణం చోటుచేసుకుంది.

తాను ప్రేమించిన యువతి వేరొకరికి సొంతం అవుతుందనే కోపంతో యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు.రోహిత్ అనే యువకుడు ఘజియాబాద్ జిల్లాలోని షేర్పూర్ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఆమె అతన్ని ప్రేమించలేదు. దీంతో ఆమెని వేధించడం మొదలుపెట్టాడు. ఇటీవల ఆమెకి మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో రోహిత్ మరింత కోపం పెంచుకున్నాడు.

తనకు దక్కని అమ్మాయి వేరొకరికి దక్కకూడదు అనుకున్నాడు. రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. యువతిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు . వెంటనే కుటుంబసభ్యులందరూ అడ్డుకున్నారు. దీంతో తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ సమయంలో యువతి వదిన పవిత్రకు బులెట్లు తగిలాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రోహిత్ అక్కడ నుంచి పారిపోయాడు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.