పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఉదయం 11 గంటలకు రెండో అంతస్తులోని కోర్టు నంబరు 14 సమీపంలో శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు గుర్తించారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో గాలిస్తున్నారు. కోర్టు వద్ద భద్రతను పెంచారు.