చైనాలో వర్షాలు వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. అక్కడ ఏకంగా ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి వారం నుంచి బయటకు పోని పరిస్దితులు నగరాల్లో కనిపిస్తున్నాయి. చైనాలో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
హెనాన్ ప్రావిన్స్ లో వరదల విలయానికి 51 మంది మరణించారట.
మొత్తం ఈ వరదల వల్ల నష్టం చూస్తే 10 బిలియన్ డాలర్ల నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కనివిని ఎరుగని నష్టం 1000 సంవత్సరాలలో ఇంత దారుణమైన పరిస్దితి ఎన్నడూలేదని చెబుతున్నారు. భారీ వర్షాలతో హెనాన్ ప్రావిన్స్ రాజధాని నగరం ఝెన్ఝౌ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఏకంగా ఈ నగరాల్లో 30 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపించాయి.
4 లక్షల మందిని సహాయక ప్రాంతాలకు తీసుకువెళ్లారు.ప్రజలకు నిత్యవసర సరుకులు, ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నారు. హెనాన్ ప్రావిన్స్ లోని వీధులన్నీ నదుల్లా పొంగిపొర్లుతున్నాయి. ఇక చాలా కార్లు బైక్లు కొట్టుకుపోయాయి.