Big Breaking- భారీ భూకంపం..255 మంది మృతి

0
126

అఫ్గానిస్థాన్​లో ప్రకృతి పెను విధ్వంసాన్ని సృష్టించింది. పక్టికా ప్రావిన్స్​లో భూకంపంతో సుమారు 255 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.