ఫ్లాష్: భారీ అగ్ని ప్రమాదం..11 మంది చిన్నారులు సజీవదహనం

0
105
Kabul

ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా అన్యం, పుణ్యం తెలియని చిన్నారులు బలికావడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆసుపత్రిలో జరగడంతో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వార్డులో 14 మంది ఉండగా ఏకంగా 11 మంది నవజాత శిశువులు సజీవదహనం కావడం దేశవ్యాప్తంగా బాధపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు భారీగా చెలెరిగినట్టు నిర్దారించారు. ఈ మంటల నుండి శిశువులను రక్షించడానికి వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బందిపడుతున్న క్రమంలో వారికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. వైద్య సిబ్బంది కష్టపడనందుకు ముగ్గురు చిన్నారులు ప్రాణాలు నిలబడినాయి. అనంతరం రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసాడు.