అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లా పరిధిలోని శుక్రవారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. కానీ ఆ మంటలు ఎక్కడి నుండి వచ్చాయన్న సమాచారం తెలియదు కానీ.. నిమిషంలోనే దుకాణాలన్నీ బూడిద అయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా నష్టం చేకూరడంతో ప్రజలు వాపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.