పంజాబ్ లోని అమృత్సర్ గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో రెప్పపాటిలోనే ఆసుపత్రిని చుట్టూముట్టాయి మంటలు. దాంతో భయబ్రాంతులయిన రోగులు ఉరుకులు పరుగులు తీశారు. అనంతరం రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాహనాలు సైతం దగ్ధం అయ్యాయి.