Breaking: 402 కోట్ల బ్యాంక్ రుణాల పేరిట భారీ మోసం

Massive fraud in the name of 402 crore bank loans

0
102

సర్వోమాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సర్వోమాక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును ఈడీ కస్టడికి తీసుకుంది. రూ.402 కోట్ల బ్యాంక్ రుణాల పేరుతో ఆయన మోసం చేసినట్టు వెంకటేశ్వరరావుపై అభియోగం ఉంది. 2018 సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. బ్యాంక్‌ రుణాలను బినామీ కంపెనీలకు నిందితుడు తరలించినట్లు గుర్తించారు. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి మణీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టారు.