ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ..నగదు, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

Massive robbery at SBI Bank, thugs stealing cash and gold

0
91

తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో గల ఎస్‌బీఐ బ్రాంచిలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం బుధవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు.

బ్యాంకు వెనుకవైపు తాళాలు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించినట్లు కనిపిస్తోంది. నగదు, బంగారం భారీగా చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. సీసీ పుటేజ్‌లను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకు చోరీకి సంబంధించి పోలీసుల నుంచి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.