Flash News- మైనర్ బాలికపై 400 మంది అత్యాచారం..పోలీసులు కూడా..

Minor girl raped by 400 people..police also ..

0
70

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..కొందరు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. బీడ్‌ జిల్లాలో ఓ మైనర్‌ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో పోలీసులు కూడా ఉన్నట్టు సమాచారం.

బీడ్‌ జిల్లా ఎస్పీ ఆర్‌. రాజా తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని అంబేజోగా తాలుకాలో ఓ గ్రామానికి చెందిన బాధితురాలుది పేద కుటుంబం. ఆ బాలిక తల్లిదండ్రులు రోజు కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. రెండు సంవత్సరాల కిందట తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురుని పోషించలేక తండ్రి బాలియకు చిన్న వయసులోనే బాల్య వివాహం జరిపించాడు. చిన్నవయస్సులో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమెకు మామ నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతేకాకుండా భర్త సైతం తండ్రినే సమర్ధించేవాడు. సంవత్సరన్న పాటు అత్తింట్లో కష్టాలు వెళ్లదీసిన ఆ బాలిక..చివరకు తండ్రి వద్దకు చేరుకుంది. ఖాళీగా ఉండటంతో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కోసం ఆరు నెలల కిందట అంబేజోగై పట్టణానికి చేరుకుంది. అక్కడ ఓ కోచింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బాలికకు పరిచయం అయ్యారు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత మరికొందరు ఇదే సాకుతో ఆ బాలిక అత్యాచారం చేశారు. ఇలా గడిచిన ఆరు నెలల కాలంలో దాదాపు 400 మంది అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 9 మందిని నిందితులుగా చేర్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో కొందరు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. గర్భంతో ఉన్న బాలిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు అబార్షన్‌ చేయించేందుకు శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.