వ్యాధి నయం చేస్తానని దారుణానికి పాల్పడ్డ భూతవైద్యుడు

-

Minor Girl Raped By Exorcist On Pretext Of Getting Rid Of Evil Spirits in Uttar Pradesh: వ్యాధి నయం చేస్తానని కోరిక తీర్చుకోవాలని చూశాడో కామాంధుడు. బాలికకు దెయ్యం పట్టిందని, తనవద్దకు పంపిస్తే మంత్రాలతో వదిలిస్తానంటూ నమ్మబలికాడు. నమ్మి వెళ్లిన బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. సీన్ రివర్స్ అవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధిత తల్లిదండ్రులు. దీంతో దొంగ భూత వైద్యుడు బండారం బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ లోని కౌశంబిలో ఓ బాలిక మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. బాలిక పరిస్థితి చూసి తల్లిదండ్రులు కృంగిపోతున్నారు. ఈ విషయం దూరపు బంధువైన భూత వైద్యుడికి తెలిసింది. బాలికపై కన్నేసిన ఆ వ్యక్తి వారి నిస్సహాయతను అదునుగా భావించాడు. బాలికకు ఏ వ్యాధి లేదని, దయ్యం పట్టిన కారణంగా అలా ప్రవర్తిస్తుందని నమ్మబలికాడు. తనకు తాంత్రిక శక్తులు తెలుసని, పూజలు చేసి బాలికకు నయం చేస్తానంటూ నమ్మించాడు. ప్రత్యేక పూజలు చేయడానికి బాలికను తనతో ఒంటరిగా పంపించాలని చెప్పాడు. అతని మాయ మాటలు నమ్మిన తల్లిదండ్రులు బాలికను ఒంటరిగా అతనితో పంపారు. బాలికను గదిలో బంధించి అత్యాచారయత్నం చేయబోయాడు ఆ కామాంధుడు. అతని నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...