ప్రమాదంలో మిస్ సౌత్ ఇండియా మృతి..ఇన్​స్టా పోస్ట్ వైరల్

Miss South India dies in road accident

0
78

మిస్​ సౌత్ ఇండియా-2021 అన్సీ కబీర్(25)​, మాజీ మిస్​ కేరళ రన్నరప్ అంజనా షాజన్(26) దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అక్టోబర్ 31 అర్ధరాత్రి కేరళలోని కొచి దగ్గర వారిద్దరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఘటనా స్థలంలోనే వారిద్దరూ తుదిశ్వాస విడిచారు. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి వారి కారు అదుపుతప్పినట్లు తెలిపారు పోలీసులు. ఈ ప్రమాదానికి కాసేపటి ముందే అన్సీ.. తన ఇన్​స్టాలో ‘ఇట్స్​ టైమ్​ టు గో’ అని వ్యాఖ్య జోడించారు. దురదృష్టవశాత్తు ఈ పోస్ట్​ చేసిన కాసేపట్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం.