అదుపుతప్పిన కారు..ఎస్ఐ కుటుంబంలో విషాదం

Missed car..sad tragedy in SI family

0
147

ఏపీ: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడ ఎస్ ఆర్ పేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి అన్నవరం దైవదర్శనానికి వెళ్తున్నారు. మల్లేపల్లి గ్రామం దగ్గర కుక్క అడ్డంగా రావడంతో కారు తప్పించబోయి అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. కారు బోల్తా పడడంతో కారులో ఉన్న ఎస్సై భార్య కోడూరు సరోజ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.