ఆర్కేబీచ్‌లో గల్లంతైన వివాహిత..హెలికాప్టర్ తో గాలింపు

0
112

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఓ వివాహిత గల్లంతు అయింది. పెండ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ మహిళ ఆర్కేబీచ్‌ తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను సరిగ్గా వెనుక వైపు గమనించలేదని కొంత సేపటికి తిరిగి చూస్తే తాను కనిపించ లేదని అతను వెల్లడించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె బీచ్‌లో గల్లంతై వుంటుందని భావిస్తున్నారు. ఆ మహిళ ఆచూకీ కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు.