Breaking: బావిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

0
79

తెలంగాణాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆమె భర్త మహిపాల్ బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వలస పోయి కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఈ ఆత్మహత్యలకు గల కారణాల ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.