తల్లిని బెదిరించి ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం ఎంత దారుణం చేశారంటే

Mother threatened and raped two daughters

0
84

హర్యానా స్టేట్ లో దారుణం జరిగింది. వీరు మనుషులా రాక్షసులా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వారిని చూస్తుంటే. తల్లిని బెదిరించి ఇద్దరు మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ బాలికలని చంపేందుకు ఏకంగా పురుగుల మందు తాగించారు. ఈ దుర్మార్గం చేసిన నలుగురు 22 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన వలస కార్మికులు.

వీరు బాలికలు ఇంటి పక్కన ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఇక మైనర్ బాలికలు ఇద్దరూ తల్లితో కలిసి కూలి పని చేసుకునేవారు. అయితే ఆగస్ట్ 5న రాత్రి నిందితులు ఆ అమ్మాయిలు ఉంటున్న ఇంట్లోకి వచ్చారు. వారి తల్లిని బెదిరించారు ఆ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశారు. తర్వాత వారికి పురుగుల మందు తాగించారు. చివరకు ఆస్పత్రికి తీసుకువెళుతుంటే మీ కుమార్తెలని పాము కరిచింది అని చెప్పు లేకపోతే చంపేస్తాం అని బెదిరించారు ఈ దుర్మార్గులు.

ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చివరకు ప్రాణభయంతో ఆమె నిజం చెప్పలేదు. కాని పోస్ట్ మార్టం నివేదికలో అన్నీ విషయాలు బయటపడ్డాయి. తల్లిని ప్రశ్నిస్తే నిజం చెప్పింది. చివరకు ఆ నలుగురు దుర్మార్గులని పోలీసులు అరెస్ట్ చేశారు.