క్షుద్రపూజలు కలకలం..సొంత సోదరినే ముక్కలు ముక్కలుగా..

0
107

ఝార్ఖండ్​లోని గఢ్​వా జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజల పేరుతో సొంత సోదరినే హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మహిళ, ఆమె భర్త సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

దలేలి గ్రామంలో లలితాదేవి తన భర్త దినేశ్​ ఓరన్​తో కలిసి జీవిస్తోంది. వీరిద్దరు కలిసి ఓరన్​ తోలాలోని రాంశరన్​ నివాసానికి క్షుద్రపూజలు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన లలితాదేవి సోదరి గుడియాదేవి, ఆమె భర్త మున్నాతో కలిసి వచ్చింది. గుడియాదేవి వచ్చిన వెంటనే లలిత మంత్రాలు చదవడం ప్రారంభించగా.. ఆమె భర్త గుడియాను కర్రతో కొట్టాడు. రక్తస్రావమై పడిపోయిన ఆమెను.. లలితా, ఆమె భర్త కలిసి ముక్కలు ముక్కలుగా నరికారు.

అనంతరం ఆమె నాలుకను కత్తిరించారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్​ భాగాలలో చేతులు పెట్టి పేగులను బయటకు తీశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అడవి మధ్యలోకి తీసుకెళ్లి దహనం చేశారు. ఇంత జరుగుతున్న గుడియా భర్త సహా బంధువులంతా ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.