రాజన్న సిరిసిల్లలో రగిలిన చిచ్చు : పరస్పర దాడులు, 10 మందికి గాయాలు

0
110

రాజన్న సిరిసిల్లలో కొత్త చిచ్చు రగిలింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసున్నారు. ఈఘర్షణలో పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగారు. మరిన్ని వివరాలు…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిరిజనుల మధ్య పొడు భూముల వివాదం చెలరేగింది. ఇరు వర్గాలుగా ఏర్పడి పరస్పరం దాడులు చేసుకున్నారు. జిల్లాలోని వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా- బావ్ సింగ్ తండాల గిరిజనుల మధ్య ఈ పొడు భూముల సాగు వివాదం రేగింది.

బావ్ సింగ్ తండా గిరిజనులు తమ పరిధిలో కి వస్తున్నారని  బాబాయ్ చెరువు తండా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వారు పొడు భూములు సాగు చేస్తున్నారని అడ్డు చెప్పడం రెండు తండాల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో రెండు తండాల మధ్య పొడు భూముల పంచాయతీ తారా స్థాయికి చేరింది. పెద్ద మనుషులు కల్పించుకుని పంచాయతీ తష్వ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

బావ్ సింగ్ తండాకు చెందిన వారు బాబాయ్ చెరువు తండాకు చెందిన మహిళల పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపించారు. వీరు పొడు భూముల్లోనే పరస్పర దాడులకు దిగారు. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న వీర్నపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.