నా భార్య కనిపించడం లేదు – నా భర్త కనిపించడం లేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్

My wife does not appear - My husband does not appear to be compliant at the police station

0
150

తన భార్య కొద్ది రోజులుగా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక అదే సమయంలో నా భర్త కూడా కనిపించడం లేదు అని మరో మహిళ వచ్చి ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులకు సీన్ అర్దమైంది. వారిద్దరూ కలిసిపారిపోయారు అనేది.

కోల్ కతాకు చెందిన దాస్, మోనికా దంపతులు బతుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఇక్కడ దాస్ ప్లంబర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే కొంతకాలంగా దాస్ ఓనర్ తో మోనికా ఫోన్ మాట్లాడుతోంది. ఎండీ ఆసీఫ్ తో తన భార్య తరచూ మాట్లాడుతున్న విషయాన్ని దాస్ గమనించాడు, పంచాయతీ పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లింది. అందరూ ఆమెకి సర్దిచెప్పారు.

కాని ఈనెల 24వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో మోనికా తన ఇద్దరు పిల్లలను తీసుకుని కోల్ కతాకు వెళ్లిపోయింది. అదే సమయంలో తన భర్త కనిపించడం లేదంటూ ఆసిఫ్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి వీరిద్దరూ వెళ్లిపోయారు అని కేసు నమోదు చేశారు పోలీసులు. వీరి గురించి పోలీసులు వెతుకుతున్నారు.