వీడిన పంజాగుట్ట బాలిక మృతి కేసు మిస్టరీ

Mystery of the death of the girl who left Panjagutta

0
100

పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మహిళతో పాటు మరో వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు..హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఈ నెల 4న ఐదేళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.  కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీనితో బాలిక మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. బాలిక మృతదేహాన్ని గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లు పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. నిందితుల కోసం 4 పోలీస్‌, 3 టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో గాలించి హత్య కేసును చేధించారు.