ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్..నక్సల్ కమాండర్ మృతి

Naxal commander killed in Chhattisgarh forest encounter

0
91

ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగిల్స్‌లో శుక్రవారం ఉదయం DRG మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో రూ.3 లక్షల నజరానాతో నక్సల్ కమాండర్ మరణించాడు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీస్ బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి సుందర్‌రాజ్ తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌లో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) కూడా స్వల్ప గాయాలకు గురయ్యాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతుండగా పరిస్థితి నిలకడగా ఉంది.