న్యూఇయర్ రోజు దారుణం..పోలీసునంటూ ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం

New Year's brutal .. Two tribal girls raped by police

0
103

ఎన్నో ఆశలతో మరెన్నో కోరికలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ఆ బాలికలు. న్యూ ఇయర్ రోజు సరదాగా గడుపుదామని విహారయాత్రకు వెళ్లారు. ఎంతో సంతోషంగా కోలాహలంగా రోజంతా గడిపారు. ఏడాదంతా ఇంతే సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఇంటికి తిరుగుపయనమయ్యారు. కానీ అంతలోనే అనుకోని దారుణం జరిగింది.

ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక గిరిజన బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థినులు..జియ్యమ్మవలస మండలం రేగడి వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా మధ్యలో రాంబాబు అనే వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలు.. పోలీసుల చర్యలు.. ఏవీ ఆడవాళ్లకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఎటుచూసిన కీచకులే.. ఏవైపు వెళ్లినా కామాంధులే. ఏకంగా పోలీసునంటూ.. మైనర్లపై తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. న్యూఇయర్ రోజు సరదాగా బయటకు వెళ్లిన బాలికలపై ఈ దారుణం జరగడం విచారకరం.