ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ నిద్రమత్తుకు తొమ్మిది మంది బలి

0
131

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా పల్నాడు జిల్లా రెంటచింతల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి  జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న టాటా ఏస్ వాహనం ఆగివున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా..ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమని ప్రాధమికంగా నిర్దారించారు. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతిచెందగా..మరి కొంతమందికి గాయాలయ్యాయి. దాంతో గాయపడిన వారిని గురజాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.