ఘోర రోడ్డుప్రమాదం..లారీ-బస్సు ఢీ..తొమ్మిది మంది దుర్మరణం

0
159

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా కర్ణాటకలోని హుబ్బళ్లి శివారు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. లారీ, ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా ఎదురెదురుగా ఢీకొనడంతో సుమారు 26 మందికి  గాయాలుకాగా..ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

మరో ఇద్దరు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తుండగా మరణించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారించగా 26 మంది స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు మహారాష్ట్రలోని కొల్హాపుర్​ నుంచి బెంగళూరుకు వెళుతున్నట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.