ఎంత దారుణం ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్దితి రాకూడదు – ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే

No girl should be in such a situation

0
90

కొందరు దుర్మార్గులు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారు. ఇలాంటి రాక్షసులని వదిలిపెట్టకూడదు. ఎన్ని కఠిన చట్టాలు ఆంక్షలు శిక్షలు అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. గుజరాత్ బనస్కాంత జిల్లాలో పంతవాడలో
ఓ దారుణం జరిగింది. 10 రోజుల కిందట ముగ్గురు యువకులు ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సమయంలో ఆమెను నగ్నంగా వీడియోలు కూడా తీశారు.

ఇక ఆమె ఈ విషయం ఇంటిలో చెప్పలేదు తర్వాత రోజు ఆమె వాట్సాప్ కు ఆ వీడియోలు పంపి తమకు డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాము అని బెదిరించారు. దీంతో ఆమె భయపడిపోయింది. నా తల్లిదండ్రులు తలెత్తుకోలేరు ఊరిలో ఇక ఉండలేరు అని ఆమె సూసైడ్ చేసుకుంది.

కుటుంబ సభ్యులు అనారోగ్యంతో చనిపోయిందంటూ సైలెంట్గా అంత్యక్రియలు జరిపేశారు. కాని ఇంత దారుణం జరిగింది అని పోలీసులకి తెలిసింది. చివరకు ఆ యువతి మొబైల్ చెక్ చేశారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఖననం చేసిన డెడ్ బాడీని మళ్లీ బయటకు తీయించి పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆ యువకులు పరారీలో ఉన్నారు వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.