ఈ గ్రామానికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు – ఎందుకంటే

No one would dare to go to this village

0
114

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. ఇప్పటీకీ ఎన్నో ప్రదేశాలు మిస్టరీగా ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల దెయ్యాలు, భూతాలు మూఢ నమ్మకాలు కూడా ఎక్కువే. దెయ్యాలు వచ్చి ఓ ప్రాంతంలో నివసిస్తాయని కొందరు నమ్ముతారు. మన దేశంలోనే కాదు మిగతా దేశాలలో కూడా దెయ్యాలు, భూతాలు అనేవి ఉన్నాయని నమ్మేవారు ఎందరో ఉన్నారు.

ఇలాగే ఓ ప్రాంతం ఉంది. ఆ గ్రామాన్ని సిటీ ఆప్ ది డెడ్ అని పిలుస్తారు. ఇది రష్యాలోని ఉత్తర ఒస్సేటియాలని దర్గావ్స్ పట్టణంలో ఉంది. ఇదంతా చూడటానికి ఎడారిగా ఉంటుంది. ఇక్కడకు ఎవరూ వెళ్లరు అసలు అంత సాహసం చేయరు.
ఎత్తైన పర్వతాల మధ్య ఈ గ్రామం ఉంటుంది. ఏకంగా 650 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రజలు తమ కుటుంబాలకు చెందిన వారి శవాలను పాతిపెట్టేవారట.

ఇక్కడ ఇప్పటికీ ఆనాటి ఇళ్లులు కనిపిస్తాయి. ఇక్కడ చనిపోయిన వారితో పాటు పడవను కూడా సమాధి చేసేవారు. వారు అక్కడ నది దాటడానికి ఈ పడవ ఉపయోగపడుతుంది అని వారి నమ్మకం. అయితే ఇప్పటికీ ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లరు. వారి గుర్తులుగా ఈ ప్రాంతం ఉండిపోయింది.