తెలంగాణలో క్షుద్రపూజల కలకలం..అర్ధరాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో..

0
164

జనాల్లో ఇంకా మూఢనమ్మకాలు తగ్గలేదు. మంత్రాలు, తంత్రాలు పేరిట క్షుద్రపూజలు అక్కడక్కడ కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు స్థానికంగా సంచలనం రేపాయి. వాటిని చూసిన జనం హడలిపోతున్నారు.

వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలోని శివ గంగ వాటర్ ప్లాంట్ వద్ద కొందరు దుండగులు అర్ధరాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలతో ముగ్గులు వేశారు. దీంతో ఉదయాన్నే నిద్రలేచిన వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఆ ముగ్గులు చూసి షాక్ కు గురయ్యారు. దీనితో భయంభయంగా బ్రతుకుతున్నారు.

ఎవరో చేత బడి చేస్తున్నారని…గతంలో కూడా ఇలానే చేశారని నిర్వాహకులు వాపోతున్నారు. ఇలాంటి క్షుద్రపూజలు, చేతబడులు చేసేవారికి తగిన అవగాహన కల్పించాలని, మరోమారు ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.