భక్తి నమ్మకం ఎంతైనా ఉండవచ్చు మరీ మూఢభక్తి ఉండకూడదు. కొందరు ఇటీవల అత్యంత దారుణమైన ఆలోచనలతో ఉంటున్నారు ముఖ్యంగా ప్రాణాలు కూడా అర్పించుకుంటున్నారు. ఎక్కడైనా నైవేధ్యం అంటే పండ్లు ఫలాలు ఇలాంటివి పెడతారు. కాని ఇక్కడ ఏకంగా ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. మూఢనమ్మకాలతో కోళ్ల ను, పొట్టేళ్లను బలి ఇచ్చేవారిని చూశాం. కాని తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో దారుణం జరిగింది.
కుది గ్రామ అటవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం భక్తి శ్రద్దలతో ఆరాదించేది. ఉదయం గుడికి వెళ్లి అక్కడ శుభ్రం చేసి అమ్మవారికి పూజలు చేసేది. ఇలా తాను అమ్మవారికి కూతురిగా భావించేది. ఓరోజు ఉదయం గుడికి వెళ్లి అక్కడ తన గొంతు కోసుకుని అమ్మవారికి నైవేద్యంగా ఆ రక్తం సమర్పించింది.
గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. ఉదయం పూజారి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. వెంటనే గ్రామస్తులకి తెలిపాడు చివరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు