వృద్ధుడి కామవాంఛ..14 ఏళ్ల బాలికపై 6 నెలలుగా..

0
100

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో ఘోరం జరిగింది. తన ఇంట్లో పని చేసే బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని. బాధితురాలి తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి బాలిక జీవిస్తోంది. ఓ ఇంట్లో పనులు చేస్తూ పశువుల కాపరిలాగా జీవనం సాగిస్తోంది ఆ బాలిక.

ఈ క్రమంలో బాలిక(14)పై యజమాని పాడు బుద్ది చూపించాడు. గత మే నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. బాలిక తల్లి విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు.

రోజు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినా, శిక్షలు వేసిన మార్పు కనిపించడం లేదు. క్షణిక పాటు సుఖం కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు.మానవ రూపంలో ఉన్న మృగాల కామవాంఛకు ఎందరో అమ్మాయిలు తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు.