ఇరకాటంలో పూర్వపు ఎస్సై..తప్పుడు కేసుతో..

On a previous essay in a dilemma..with a false case ..

0
95

ఏపీ: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో పని చేసిన పూర్వపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వెంకట నాగార్జునపై ముమ్మిడివరం పి. ఎస్. లో క్రైమ్ నంబర్ 234/2021,తేదీ 29.10.2021, సెక్షన్ 218IPC క్రింద నమోదు అయ్యింది. రౌడీ షీటర్ పిల్లా రమేష్ ను కాపాడే ప్రయత్నంలో తప్పుడు కేసు నమోదు చేసినట్లు అభియోగం.

పోలిశెట్టి రాజేష్ కుమార్ పై తప్పుడు ఎఫ్.ఐ.ఆర్.ను నమోదు చేసి సివిల్ నేచర్ అని రిఫర్ చేసి సివిల్ డిస్ప్యూట్ లోనికి ప్రవేశపెడుతూ తప్పుడు రికార్డ్ ఫ్రేమ్ చేశారని పోలిశెట్టి రాజేష్ కుమార్ కోర్టును ఆశ్రయించగా ఎస్ఐపై FIR నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కేసు నమోదు చేశారు.