ఒకే ఒక్క గుడ్డు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు రప్పించింది- ఇంతకీ గొడవ ఏమిటంటే

ఒక కోడిగుడ్డు పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పింది

0
104

ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు పెద్దగొడవలుగా మారతాయి. ఏకంగా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిన ఘటనలు ఉన్నాయి.చిన్న విషయానికి కూడా అహం దెబ్బ తిన్నట్టుగా భావించి, విపరీతమైన హంగామా చేసేవారు ఉంటారు. చివరకు వారు ఇబ్బందుల్లో పడతారు. ఒక కోడిగుడ్డు ఒక వ్యక్తిని గాయాలపాలు చేసింది. మరోవ్యక్తిని పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పింది. బెంగళూరు లో జరిగిన ఈ ఘటన పెను వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి చికెన్ కొనేందుకు వెళ్లాడు. ఈ సమయంలో చికెన్ కొడుతుంటే అతను ఓ గుడ్డు తీసుకుని సంచిలో వేసుకున్నాడు.దీంతో దుకాణం యజమాని ఆ యువకుడిని కోపంతో చితక బాదాడు. విషయం పోలీసుల దగ్గరకు చేరింది. రెండు కేజీల చికెన్ ఆర్డర్ చేశాను, చికెన్ సిద్ధం అవుతున్న సమయంలో అక్కడ ఉన్న ఒక గుడ్డును తీసుకున్నాను. దానికి డబ్బులు ఇస్తాను అని చెప్పాను అని ఆ బాధితుడు చెబుతున్నాడు. అయితే నాకు చెప్పకుండా అతను గుడ్డు సంచిలో వేసుకున్నాడని ఓనర్ వాదన.

చికెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు గుడ్డు డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పాను, అయినా అతను నా మాట వినలేదు అనినన్ను దొంగగా భావించి కొట్టాడు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇనుప కడ్డీతో అతనిపై దాడి చేశాడు. చివరకు దీనిపై కేసు నమోదు అయింది. ఓ గుడ్డు చివరకు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చింది.