Flash- సీఆర్పీఎఫ్‌ జవాన్ల మధ్య కాల్పులు కలకలం..ఒకరు మృతి

0
81

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురంలో జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. సీఆర్పీఎఫ్‌ 39వ బెటాలియన్‌కు చెందిన ఎస్సై, అలాగే మరో జవాను మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.