యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

0
82

ఒకవైపు ఆన్ లైన్ గేమ్ లు, మరోవైపు రుణ యాప్ లు యువత పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే వీటి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరంకు చెందిన యువకుడు లింగాల చెన్న కృష్ణ ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టి రెండు లక్షలు బకాయి పడ్డాడు. దీనితో ఆన్లైన్ గేమ్ సంస్థ యువకుడిని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆ యువకుని తల్లిదండ్రులు రూ.1.60 లక్షలు సంస్థకు చెల్లించాడు. ఇక మిగిలిన రూ.40 వేల బకాయి కోసం యువకుడిని తీవ్రంగా వేధించసాగారు ఆన్లైన్ గేమ్ సంస్థ.

దీనితో బకాయి చెల్లించలేక, ఒత్తిడిని తట్టుకోలేక చెన్న కృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని మృతికి కారణమైన ఆన్లైన్ గేమ్ సంస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.