సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. అవతల వారు ఎవరో తెలియదు వారి ఫ్రొఫైల్ పోటో బాగుంటే చాలు కొందరు వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక అందులో అబౌట్ డేటా చూసి మనోడు పెద్ద ప్రొఫైల్ అనుకుంటారు. కాని దాని వెనుక ఫేక్ గాళ్లు చాలా మంది ఉంటారు సో జాగ్రత్తగా ఉండాలి. తాజాగా కడప జిల్లా యువకుడు చెన్నుపల్లి ప్రసన్నకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్ లైన్ లో పరిచయమైన మహిళలను, అమ్మాయిలను మోసం చేస్తున్న ప్రసన్నకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువకుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువు మానేశాడు విలాసాలకు అలవాటు పడ్డాడు.
చెయిన్ స్నాచింగ్ లు, ఇళ్లలో చోరీలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఓ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అని టోకరా వేశాడు ఇలా దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆన్ లైన్ లో అమ్మాయిలు, మహిళలతో పరిచయం పెంచుకుంటాడు, నైస్ గా మాట్లాడుతూ వారి నుంచి అర్థనగ్న ఫోటోలు వీడియోలు సేకరిస్తాడు, తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారిని లైంగికంగా వాడుకునేవాడు. చాలా మంది అతని వల్ల మోసపోయినా కేసు పెట్టలేదు పరువు పోతుంది అని ఆగిపోయారు. ఏకంగా 200 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు ప్రసన్నకుమార్ బారినపడ్డారు. అతని దగ్గర ఫోన్ నిండా అమ్మాయిలు, మహిళల ఫొటోలే ఉన్నాయి.
అమ్మాయిలు చాలా జాగ్రత్త అని చెబుతున్నారు పోలీసులు