ఓయూలో కలకలం..విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

OU..Tension in students

0
131

ఉస్మానియా యూనివర్శిటీలో కలకలం చెలరేగింది. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక ఓ సమాధి ఇప్పుడు విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్టూడెంట్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూశారు. ఏదైనా జంతువును చంపి ఇక్కడ తీసుకొచ్చి పూడ్చిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. దానిపై చల్లిన పూలు కూడా తాజాగా ఉండటంతో.. ఇటీవలే ఖననం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓయూలో ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.